బతుకమ్మ,ఏర్గట్ల: మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్ డి ఎల్ పిఓ శివకృష్ణ సోమవారం ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఇప్పటి వరకు 80% కుటుంబాల సర్వే పూర్తి అయిందని, మిగిలిన సర్వేను మరో రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఈలోగా అన్ని కుటుంబాలను సర్వే చేయాలనీ,వివరాలన్నీ సరిగ్గా,నమోదు జరిగేటట్లు చూడాలని సర్వే వివరాల ఆన్ లైన్ నమోదు కొరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్మూర్ డి ఎల్ పి ఓ శివకృష్ణ ఎన్యుమరేటర్ల కు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీ ఓ శివచరణ్,పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, కారోబార్ తొర్తి సాయన్న, పాల్గొన్నారు.
