25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

  • రూ. 5 లక్షలు ఆస్తి నష్టం

 

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన ఘటన శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన అంజవ్వ అనే మహిళ రేకుల ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.ఇంట్లో ఉన్న వంట సామాను, నిత్యవసర వస్తువులు, బట్టలు కాలి బూడిదయ్యాయి.అప్రమత్తమైన అంజవ్వ తన కుటుంబ సభ్యులతో బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు చేరుకుని మంటలు ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నారు.

More articles

Latest article