30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డిలో కంకణాలకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : జాతీయ గ్రంథాలయం 58వ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ ను ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిని కవి సమ్మేళనంలో భీమ్ గల్ కు చెందిన కవి కంకణాల పుస్తక ప్రాముఖ్యతను వివరించి, పుస్తకం జ్ఞాన మార్గదర్శి అనే కవిత శీర్షికను చదివివినిపించారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కంకణాలను శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. ఈ కవి సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా నుండి కంకణాల ఒక్కడే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఈ కవి సమ్మేళనంలో కామారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎస్. వంశీకృష్ణ, కామారెడ్డి జిల్లాకు చెందిన కవులు, కవయిత్రులు, కళాకారులు మోత్కూరి అశోక్ కుమార్, అంబీర్ మనోహర్, సిరిసిల్లా గఫూర్ శిక్షక్, రుద్రంగి రమేశ్, ఎనిశెట్టి గంగా ప్రసాద్, కౌడి రవీందర్, తగిరంచ నరసింహారెడ్డి, అల్లి మోహన్ రాజ్, పురం గంగా, ఓరగంటి హేమలత, మంద పితాంబర్, ఉమా శేషారావు వైద్య, తిరుమల తిరుపతిరావు, తిరుమల కైలాస్, బాల కవయిత్రులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article