23.4 C
Hyderabad

జిల్లా యువజన క్రీడాధికారికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా యువజన క్రీడా అధికారిగా నూతనంగా ఎంపికైన భక్కురి పవన్ కుమార్ ను గురువారం షెట్ పల్లీ గ్రామ యువకులు ప్రదీప్ శర్మ, గురిజాల నర్సారెడ్డి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామం నుంచి జిల్లా స్థాయి అధికారిగా ఎంపికవడంతో గ్రామంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకొని సంబరాలు చేసుకున్నారు. తన జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం యువకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article