బతుకమ్మ, నవీపేట్ : నిజామాబాద్ మార్కేట్ కమిటీ నూతన వైస్ చైర్మన్ జంగిటి రామచందర్ ను తన స్వగ్రామం లో మంగళవారం నాడు బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు, అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం, రైతు బిడ్డగా గుర్తించి ప్రభుత్వం పదవి ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలేశ్వర్ మాజీ సర్పంచ్ సరిన్, నవీన్, రమేష్, కుమ్మరి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.