బతుకమ్మ, జుక్కల్ :- జుక్కల్ మండలంలోని బస్వపూర్ గ్రామస్తులు నూతనంగా వచ్చిన ఎస్ఐకి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణ త్రివేణి సంగం కావడంతో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భాషలు వస్తాయని ఆయన అన్నారు. ఇక్కడ ప్రజలు అమాయకులని ఆయన అన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గడ్డంవార్ బాబు, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
