నిజాయితీ చాటుకున్న పెట్రోల్ పంప్ సిబ్బంది

0 15,447

బాల్కొండ, బతుకమ్మ: పెట్రోల్ పంప్ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఇత్వార్ పేట్ లింగన్న అన్నారు. గురువారం సాయంత్రం లింగన్న అనే వ్యక్తి నిజామాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా కార్ లో పెట్రోల్ ఐపోవడంతో అందుబాటులో ఉన్న ముబారక్ నగర్ షాం ఆటోలైన్ అనే భారత్ పెట్రోల్ పంపులో  770 రూపాల పెట్రోల్ పోయించుకున్నాడు.  అయితే స్కానర్ లో  రూ. 770 లకు బదులు 7700 పంపాడు. ఆ సమయంలో ఫోన్ బ్యాలెన్స్ చూసుకోలేదు. ఇంటికి వెళ్లి బాలన్స్ చూసుకోగ రూ.6900 తక్కువ బాలన్స్ వచ్చాయి. వెంటనే నిజామాబాద్ షాం పేట్రోల్ పుంపు నంబర్ ఆరతీసి వారి యజమానికి ఫోన్ చేస్తే స్పందించి మీరు వచ్చి డబ్బులు తీసుకోగలరు. నిజమే మీరు పెట్రోల్ పోయించుకొని మాకు ఎక్కువ డబ్బులు పంపారు. కాబట్టి ఉదయం వచ్చి మీ డబ్బులు తీసుకోండి అని వారి సిబ్బంది శ్రీనివాస్ డబ్బులు ఇచ్చి నిజాయితీ ని చాటుకున్న షాం ఆటోలైన్ పెట్రోల్ పంప్ సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.