25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

న్యాయవాదుల ప్రయోజనాల కోసమే”ఇల్ప”

Must read

📰 Generate e-Paper Clip

  • ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : న్యాయవాద వృత్తి లో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కార్యాక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఇండియన్ లీగల్ ప్రొపెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ హల్ లో ఆయన న్యాయవాదులనుద్దేశించి మాట్లాడారు. జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదగడానికి కావలసిన అన్ని రకాల శిక్షణలకు శ్రీకారం చుట్టుకున్నట్టు ఆయన తెలిపారు. చట్టబద్ధమైన విషయ పరిజ్ఞానం పెంపొందించడం, వ్రాత పూర్వక రాతలలో మెలకువలను నేర్పించడానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఆయన వివరించారు.సమాజం నుండి ఎదిగి వచ్చిన వాళ్ళంగా సమాజం పట్ల సామాజిక బాధ్యత, ప్రజల న్యాయబద్ధమైన హక్కుల కోసం చట్టబద్ధమైన వెతుకులాటలో ఇల్ప ముందు వరుసలో నిలబడి న్యాయస్థానాలలో, ప్రభుత్వ, ప్రయివేటు విభాగాలలో బలమైన వాదనలు వినిపించి వ్యవస్థలను చట్టం వైపు నడిపిస్తుందని గౌడ్ తెలిపారు.సమాజానికి సామాజిక నిర్మాతలుగా ఉండి ప్రజాపయోగ కార్యక్రమాలలో బాగస్వాములం అవుతున్నామని ఆయన పేర్కొన్నారు.కష్ట కాలంలో ఉన్న న్యాయవాదులకు అండగా,అనారోగ్యంతో ఉన్నవారికి, మరణించిన వారి కుటుంబాలకు ఆలంబణగా ఇల్ప ఉంటుందని చెప్పారు. మాట్లాడుతూ మందిరానికి పూజారి ఎంత ముఖ్యమో సమాజమనే మందిరానికి న్యాయవాదులు అంత ముఖ్యమని తెలిపారు. న్యాయవాద వృత్తి వ్యక్తిగతం కాదని సమాజ సంక్షేమం కోసమని ఆయన అన్నారు.ఇప్పిడిప్పుడే ఎదుగుతున్న వెనుకబడిన తరగతులు,షెడ్యూల్డు కులాల,షెడ్యూల్డు తరగతులు, మైనారిటీలతో పాటు సమాజంలో సమ భాగమైన మహిళలు న్యాయవాది వృత్తిలో నిలద్రొక్కుకోవడానికి, జ్యూడిషియరిలో ఉన్నత పదవులు పొందడానికి సహాయకారులుగా నిలబడతామని ఆయన తెలిపారు.ఇంటింటికీ రాజ్యాంగ ఫలాలు అందించడమే మహాకార్యం భుజాన వేసుకుని వెళుతున్నామని,ప్రజల హక్కుల కోసం భరోసా ఇచ్చినవారం కాగలమని కృష్ణారెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా న్యాయవాదుల  సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని న్యాయవాదులు అండగా నిలవాలని ఇల్ప రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం, ఆరోగ్య భీమా,జూనియర్ న్యాయవాదులకు ఆర్ధిక భృతి ఇతోధికంగా సాధించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.జూనియర్ సివిల్ జడ్జిలుగా,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, అదనపు జిల్లాజడ్జిలుగా ఎంపిక కావడానికి కావలసిన వనరులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. బార్ ఉపాధ్యక్షుడు దిలీప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇల్ప రాష్ట్ర నాయకులు ఎ. ఆంజనేయులు, ఎన్ జె శ్యామ్సన్,కె. వెంకటేశ్వర్ ప్రసాద్,ఎ. సురేష్,న్యాయవాదులు బాస రాజేశ్వర్ శ్రీహరి ఆచార్య, ఆశ నారాయణ, రంజిత్ సుతారి, బైర గణేష్,అరేటి నారాయణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article