అంగన్ వాడీ కేంద్రాలకు బతుకమ్మ, దసరా పండగ సెలవులు
. . . 12 రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం . . . లబ్ధిదారులకు ముందస్తుగానే టేక్ హోమ్ రేషన్ పంపిణీకి అనుమతి హైదరాబాద్, బతుకమ్మ: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన...