నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
ఎన్నికల విధులకు గైర్హాజర్ అయిన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్ లోని 4, 5, 6 వార్డుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ)గా హెచ్.ఎం వనజా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్నికల విధులకు గైర్హాజర్ అయ్యారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్.ఎం వనజా రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు.
