- రైతు అవగాహన సదస్సులో నిపుణుల సూచన
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని ముచ్కూర్ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వరి సాగు పద్ధతులపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు మాట్లాడుతూ వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచించిన ఆధునిక సాగు పద్ధతులను ఆవలంభిస్తే అధిక దిగుబడులతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించవచ్చునన్నారు. రైతులకు డైరెక్ట్ సీడెడ్ రైస్, వీడ్ డర్, డ్రైన్ పైప్ వినియోగం వంటి ఆధునిక పద్ధతుల ద్వారా పెట్టుబడి భారం తగ్గించుకోవచ్చని, కూలీల ఖర్చు తగ్గుతుందని, నీటి వినియోగం నియంత్రణలో ఉంటుందని వివరించారు. అదే విధంగా, ఈ పద్ధతులు అనుసరిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు, దిగుబడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పద్ధతుల వల్ల గ్రామీణ రైతులు లాభపడతారని, కొత్త విధానాలను ధైర్యంగా ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కమ్యూనిటీ ఫెసిలిటేటర్ నక్క హరీష్ రైతులకు ప్రాక్టికల్ డెమోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు రవి, అనిల్, దాస్, విశాల్ రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
