26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణలో రాబోయేవి హై టెన్షన్ రాజకీయాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రధాని కాలేదని తెలిసి రాహుల్ ను రేవంత్ మోసం చేస్తున్నారు

. . . కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు సీఎం కావాల్సి ఉండే

. . . మహేష్ కుమార్ గౌడ్ ను రేవంత్ రెడ్డి రాజకీయంగా ఖతం పట్టిస్తున్నారు

. . . 2029 అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాజయం.. రేవంత్ రెడ్డి పరార్ పక్కా

. . . ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బిజెపి నాయకులు రోడ్డేక్కాలి

. . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి

 నిజామాబాద్, బతుకమ్మ:

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వాఖ్యలు అక్షర సత్యాలు.. తెలంగాణలో రాబోయే బిజెపి గవర్నమెంట్.. కానీ ఎన్నికల కాలంలో రాష్ట్రంలో హై టెన్షన్ రాజకీయాలు ఉంటాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జ్యోస్యం చెప్పారు. సోమవారం బిజెపి జిల్లా కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ… రాబోయే పదేళ్లు రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని అన్న రేవంత్ రెడ్డి.. 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్ గాంధీ ప్రధాని చేస్తానని ఆయనను మోసం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ లో చరిష్మా ఉన్న నేత కొద్దో గొప్ప పేరున్న ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకులు గుర్తించడం లేదని పేర్కొన్నారు. సీఎంగా పదేళ్లు ఉండి బాగా సంపాదించి అ పైసలు రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి కావాలని ప్లాన్ చేస్తున్నారు ఎంపి అరవింద్ ఆరోపించారు. కేరళలో కేసీ వేణుగోపాల్ ను సీఎం చేయాలని రేవంత్ రెడ్డి చేతులు కాల్చుకున్నాడు అన్నారు. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి లాంటి నిఖార్సైన నాయకుడు సీయం కావాల్సి ఉండగా పత్తలు అడే రేవంత్ సీయం అయ్యాడని వ్యాఖ్యనించారు. రాజకీయంగా మహేష్ కుమార్ గౌడ్ ను రేవంత్ రెడ్డి ఖతం పట్టిస్తున్నారని అన్నారు. అందుకే ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ జఫం మానడం లేదని అన్నారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు పరాభావం చెందడమే కాకుండా పరార్ అవుతారని అరవింద్ అన్నారు..

High tension politics is coming in Telangana

నిజామాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు అని ఎంపి అరవింద్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయకపోయిన పీసీసీ చీప్ మహేష్ కుమార్ , ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఎప్పటికీ పూర్తి కాదని అన్నారు. అందుకు సంబంధించిన లెక్కలు పత్రాలు ప్రదర్శించారు. నిజామాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు కోసం 100 కార్లు వెళ్లి సీఎం ను కలవాలని బిజెపి అర్బన్, రూరల్ నాయకులు సూచించారు. ఒక వేళ అపాయింట్ ఇవ్వకపోయినా, నిధుల విడుదల చేయకపోయిన అందరు రోడ్డెక్క లని అన్నారు. దానికి తన సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు స్థలం కేటాయించమంటే కాంగ్రెస్ నాయకులు డిసిసి భవనంకు కేటాయించకున్నారని దానికి 10 రోజల్లో స్పందించకపోతే పసుపు రైతులు ఆందోళనకు సిద్ధం కావాలని దానిలో తాను పాల్గొంటానని అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఔటర్ రింగ్ రోడ్డు తో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధుల కోసం రోడ్డెక్కితే కాంగ్రెస్ నాయకుళ్లలో వణుకు రావాలన్నారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం స్థలం  మంజూరు కోసం చేపట్టాల్సిన ధర్మదీక్ష ఎసిపి అనుమతి ఇవ్వలేదని, ఆయన ఫక్తు కాంగ్రెస్ కార్యకర్తలాగా పని చేస్తున్నారని అన్నారు.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని అన్నారు. బండి సంజయ్ తనయుడి కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది వ్యాఖ్యనించారు.ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

High tension politics is coming in Telangana

More articles

Latest article