25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హలో ఉపసర్పంచ్.. ఛలో హైదరాబాద్ ని విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మహేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఉప సర్పంచ్ ల హక్కుల కోసం జూన్ 25 నిర్వహిస్తున్న హలో ఉపసర్పంచ్.. ఛలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ లు విజయవంతం చేయాలని ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఉప సర్పంచ్ ల హక్కుల కోసం సోమవారం బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి ని కలసి వినతి పత్రం అందించగా, ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఉప సర్పంచ్ ల చెక్ పవర్ చేజారిపోతోందని, దాని కోసమే ఈ ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా ఉప సర్పంచ్ లు అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని, ధర్నా ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాక్లుర్ మండలాధ్యక్షుడు సతీష్, నవిపేట్ మండల అధ్యక్షుడు రాజు విరెందర్, ఆలూర్ మండల అధ్యక్షుడు రాజు తదితరులు ఉపసర్పంచ్ లు పాల్గొన్నారు.

 

Hello Upasarpanch... Let us make 'Chalo Hyderabad' a success.

More articles

Latest article