నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లో 7 మండలాలు, ఆర్మూర్ డివిజన్ లోని 1 మండలంలో ఈ నెల 14న జరిగే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు గాను అన్ని రకాల పకడ్బందీగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ముఖ్యంగా గొడవలు సృష్టించి వ్యక్తులు తమ దృష్టి ఉన్నదని తెలిపారు. ప్రజలు పోలీసు శాఖ పట్ల ఎంతో స్నేహ భావంతో నమ్మకంతో ఉంటారు అని, ఎవరికైనా శాంతిభద్రతల సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవ్వరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు ఎల్లప్పుడు పోలీసు వారికి సహకరించగలరు అని తెలియజేశారు.
రెండో విడతలో 158 సర్పంచ్ స్థానాలు, 1081 వార్డు సభ్యుల ఎన్నిక సందర్భంగా 1120 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇద్దరు అదనపు డీ.సీ.పీలు, 5 ఏ.సీ.పీలు , 16 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్ లు/రిజర్వ్ ఇన్స్పెక్టర్ , 67 సబ్ ఇన్స్పెక్టర్లు/ ఆర్.ఎస్.ఐ లు , 74 మంది ఏ.ఎస్.ఐ / ఏ.ఆర్.ఎస్.ఐ లు , 136 హెడ్ కానిస్టేబుల్ , 601 కానిస్టేబుల్ / మహిళా కానిస్టేబుల్ , 218 హోంగార్డులు / మహిళా హోంగార్డు నియమించినట్టు తెలిపారు.
