29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  పశ్చిమ-మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు.. గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఒక్కో చోట అతి నుంచి అత్యంత భారీ వర్షాలు.. కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 20 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.  అంతేకాకుండా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

More articles

Latest article