బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : మానవ జీవన శైలిలో మార్పులతో గుండె సమస్యలను అధిగమించవచ్చని అదనపు డిప్యూటీ ( అడ్మిన్ )కమిషనర్ బసవ రెడ్డి పేర్కొన్నారు. చెడు అలవాటులకు దూరంగా ఉండాలని సూచించారు. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది 2కే వాకేథన్ కార్యక్రమాన్ని వినాయక నగర్ లోని రుక్మిణి చాంబర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ బసవరెడ్డి హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గుండె నొప్పి సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయన్నారు. వారి ఆహార అలవాట్లు, స్మోకింగ్ చేయడం, వ్యాయామం చేయకపోవడంతో గుండె కు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల సదానంద రెడ్డి మాట్లాడుతూ…
యువత సైతం ఈ గుండె నొప్పి బాధతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోజు ఒక గంట సమయం ప్రశాంత వాతావరణంలో వ్యాయామం చేస్తే గుండె నొప్పి సమస్యల నుంచి దూరం కావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు జోలికి యువత వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ సందీప్ రెడ్డి, రవి కిరణ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

