24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎన్రోల్ అయిన న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కార్పస్ ఫండ్ ను రూ.500 కోట్లకు పెంచాలి
  •  చనిపోయిన న్యాయవాదులకు రూ.25 లక్షల డెత్ బెనిఫిట్ ఇవ్వాలి
  • ఏఐఎల్యూ రాష్ట్ర నాయకులు, సీనియర్ న్యాయవాది వి.సంఘం

 

నిజామాబాద్ సిటీ, బతుమకమ్మ : ఎన్రోల్ అయిన న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ఏఐఎల్యూ రాష్ట్ర నాయకులు, సీనియర్ న్యాయవాది వి.సంఘం అన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో  నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం కరపత్రం, డ్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ 2025 బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 2019 తర్వాత న్యాయవాదిగా ఎన్రోలు అయిన న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ చేయలేదన్నారు. వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్రోల్ అయిన న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, కార్పస్ ఫండ్ ను  రూ.500 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ వెల్ఫేర్ బోర్డు లో ఉన్న రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ పై వచ్చే వడ్డీని హెల్త్ కార్డులకు కేటాయిస్తున్నారని ఇది ఎటు సరిపోవడం లేదని చెప్పారు. రూ.2 లక్షలు బీమా సౌకర్యం వైద్య ఖర్చులకు సరిపోవడం లేదని దానిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని, నెట్వర్క్ హాస్పిటల్ జిల్లాలలో కూడా సెలెక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరారు. అనారోగ్యంతో పాటు ఇతరత్రా కారణాలతో మరణించిన న్యాయవాదులకు 25 లక్షల డెత్ బెనిఫిట్ అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లులో సవరణలు చేయాలని, బిల్లు న్యాయవాదులకి నష్టదాయకంగా ఉందని అన్నారు. ఐలు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హెల్త్ కార్డులు, అదనపు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులతో సంతకాలు సేకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పరుచూరి శ్రీధర్, యూనిస్ ఖాన్, నరేందర్ రెడ్డి,కేశవ రావు,రవిబాబు,ఖలీద్, జునాథ్ అలీ, గగన్ అన్వేష్ జి.రమేష్, సుదర్శన్ నాయక్, న్యాయవాదులు పాల్గొన్నారు.

More articles

Latest article