. . . ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సన్మానించిన బిసిటియు అధ్యక్షుడు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సేవా గుణం, పేదల పక్షపాతి అయిన నాగమోహన్ జిల్లా ఆసుపత్రి కి సూపరింటెండెంట్ గా రావడం తో పేదలకు ఆరోగ్య పరంగా మేలు జరుగుతుందని బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నాగమోహన్ ని శుక్రవారం ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్ లో కలిసి శాలువా, పూల బొకే తో ఘనంగా సన్మానించి సావిత్రి బాయి పూలే జ్ఞాపిక ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జివో జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులు పెద్దొళ్ల నాగరాజు, బిసిటియు అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామ కృష్ణ, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కోశాధికారి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, వేణు, రవిచంద్ర, సుమన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

