29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్యకర్తలే పార్టీకి బలం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కార్యకర్తలే పార్టీకి బలమని, కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలకు 24 వ వార్డ్ ఇంద్రనగర్ కాలనీ నుండి 40 మంది కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డిసిసి జిల్లా అధ్యక్షులు పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తామని, రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని కొత్తగా చేరిన కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీద మహేష్, సుదర్శన్, రాజు, శ్రీను, చంద్రం, రామకోటి, నందు, ప్రశాంత్, రఘు, రాజలింగం, గుడ్ల శీను, బ్రహ్మం, సంజయ్, దినేష్, అక్షయ్, మనోజ్, వరుణ్, బబ్లు, వసంత్, సూర్య, శశి, ప్రకాష్, శ్రీకాంత్, నవీన్, గణేష్, అజయ్, మల్లయ్య, ప్రకాష్, బన్నీ ఉన్నారు.

 

Activists are the strength of the party.

More articles

Latest article