- భర్త హత్యకు కుట్ర
- నిందితుల అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భార్యను, మిగతా 5గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహిహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మాచారెడ్డి మండల పరిధిలోని ఫరీద్ పేట గ్రామ శివారులో మోటార్ సైకిల్ పై డ్యూటీకి వెళ్తున్న ఘనపురం గ్రామానికి చెందిన సాడెం కుమార్ అనే యువకుడిని ఈ నెల 21న ఇనుపరాడ్లతో దాడి చేసి హత్యాయత్నం చేశారని తెలిపారు. బాధితుడు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కామారెడ్డి ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బ్రుందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. దర్యాప్తులో అదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఫిర్యాదుదారుడి భార్య సాడెం రేణుక కూడా ఉందన్నారు.

తుది విచారణలో వివాహేతర సంబంధం నేపథ్యంలో రేణుకు తన భర్త హత్యకు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు కాంపల్లి మహేష్ రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ల పల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నారని తెలిపారు. అక్కడే ఘనపురం గ్రామానికి చెందిన సాడెం రేణుకతో పరిచయం ఏర్పడి క్రమంగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు. రేణుక భర్త కుమార్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ కలిసి కుమార్ ను హత్య చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. కుమార్ మరణించిన తరువాత అతని ఆస్తిని అనుభవించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలు చేయడానికి అల్వాల్ కు చెందిన మహమ్మద్ అశ్వాక్ కు రూ.15లక్షు సుపారీకొ ఒప్పించి, అతని అనుచరులైన ముబిన్, అమీర్, అన్వర్, మోసిన్లకు అడ్వాన్స్ గా రూ.2లక్షలు ఇచ్చారని తెలిపారు. వారి పథకం ప్రకారం కుమార్ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని గుర్తించి మాచారెడ్డి మండల పరిధిలోని ఫరీద్ పేట గ్రామ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్దకు హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నరని తెలిపారు. దీంతో ఈనెల 21న ఉదయం కాంపల్లి మహేష్, అశ్వాక్, అతని అనుచరులు కుమార్ ను వెంబడించి ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారని తెలిపారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రావడం గమనించిన నిందితులు అక్కడి నుండి పరారయ్యారని తెలిపారు. ఈ కేసులో ఐదు గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కారు, ఒక ఆటో, ఒక గొడ్డలి, రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్నమిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదిండంలో క్రుషి చేసిన కామారెడ్డి రూరల్ సీఐ.ఎస్.రామన్, మాచారెడ్డి ఎస్ఐ.వై.అనిల్, క్రైం టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

