వెబ్ న్యూస్, బతుకమ్మ : కంచ గచ్చిబౌలి భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. ఈభూములపై వట ఫౌండేషన్, హెచ్ సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యలపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయస్థానాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) గడువు కోరారు. ఏజీ కోరిక మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపటొద్దని మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది.
