మెదక్, బతుకమ్మ : మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతుంది. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవిత మరోసారి హరీశ్ రావు టార్గెట్‌గా కవిత విమర్శలు గుప్పించారు. మోసం చేయడం హరీశ్ రావు నైజమని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతో సరిపోతుందన్నారు. బీఆర్ఎస్ ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీశ్ రావు నైజమని, ఆయన గురించి గట్టిగా మాట్లాడితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్ రావు పేరుకు కృష్ణార్జునులని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదని విమర్శించారు. తాను బీఆర్ఎస్ లో లేనని ఉప ఎన్నికకు దూరంగా ఉన్నానని, హరీశ్ రావు పార్టీలో ఉంటూ మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో విఫలమైందన్నారు. హరీశ్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం కు సంబంధాలున్నాయన్నారు. జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లు కేడరను పెంచుకోలేదని ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీశ్ రావు ఎలా సపోర్టు చేస్తారని కవిత ప్రశ్నించారు. రెడ్డిపల్లిలో హరీశ్ రావు 400 ఎకరాల ఫాంహౌస్ కట్టారని, ఇందుకోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారని, దీంతో 56 మంది రైతుల 59 ఎకరాలు పోతున్నాయని ఆరోపించారు. ఎకరం, అర ఎకరం ఉన్న చిన్న రైతులు నష్టపోతున్నారు.. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి హరీశ్ రావు ఇలా చేశారని కవిత వ్యాఖ్యనించారు. కాగా, కవిత ’ఎక్స్‘ వేదికగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితంపై ’కర్మ హిట్స్ బ్యాక్‘ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చాంనీయశమైన విషయం తెలిసిందే.