నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా వాసి ఇప్ప కాయల హరిదాసు కు అరుదైన గౌరవం దక్కింది. ఇటివల పాండిచ్చేరిలో అమెరికన్ విష్డం పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాన్వొకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎప్పకాయల హరిదాసు కు ” సోషల్ సర్వీస్ – స్పిరిచువల్ సర్వీస్ ” అనే రంగం పైన గౌరవ డాక్టరేట్ ను అందచేశారు. ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పి. ఎఫ్. ఐ, ఎన్. బి. ఎస్. ఎస్ నేషనల్ డిప్యూటీ చైర్మన్ డా. ఎస్. జయ కృష్ణన్ , 17 సార్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్, అసోసియేట్ డైరెక్టర్ ఇన్ సిల్వర్ స్క్రీన్ వరల్డ్ రికార్డ్ ట్రైనర్ డా. అరుణ్ చిన్న దురై, చెన్నై హైకోర్టు న్యాయవాది ఏం. ప్రభాకరణ్ ,అమెరికన్ విష్డం పీస్ యూనివర్సిటీ అధికారులు, ప్రతినిధులు చేతుల మీదుగా ఈ అరుదైన గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా హరిదాసు మాట్లాడుతూ ఇంతటి గొప్ప అవార్డులు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు, ఎంతో శ్రమ, కృషి, పట్టుదల, ఓపిక, సహనం, కష్టం, బాధలు అన్ని తట్టుకుని నిలబడి ఒడి దుడుకులకు భయపడకుండా అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగిపోతున్నాము కాబట్టి ఈ అవార్డు దక్కింది అని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి అనాధ పిల్లలకు, నిరాశ్రయులకు అన్నదానం చేయడం, దైవిక మార్గంలో నడుస్తూ ఎంతోమందికి సామాజిక సేవ చేయడం జరిగిందన్నారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అమెరికన్ విష్డమ్ పీస్ యూనివర్సిటీ వారికి, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
