28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ, దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారని కలెక్టర్ అన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక సేవ, రాజకీయ రంగాల్లో మహిళలు ముందుండి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలకు భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటిస్తూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article