నిజాంసాగర్, బతుకమ్మ : తమ హోటల్లో మరిచిపోయిన బంగారు నగలను బాధితులకు అప్పజెప్పి హోటల్ యజమాని తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆర్.టి.సి.బస్టాండ్ వెనుకాల ఇమ్రాన్ హోటల్ లో ఆదివారం ఓ మహిళ మిర్చి బజ్జి తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి హోటల్ యజమాని సయ్యద్ మొయిజ్ ఒద్దిన్ పని చేస్తుండగా చెవి కమ్మలను గుర్తించారు. హోటల్ లో పనిచేసే ఆడమనిషికి చూపిస్తే బంగారం కమ్మలని తెలియడంతో తీసుకొని పక్కన పెట్టారు. అంతలో వేరే కస్టమర్లు లేడీస్ వస్తే అడుగుతే ఏం పడిపోలేదని అన్నారు. హోటల్ లో ఉన్న కెమెరాలు చెక్ చేస్తే మిర్చి బజ్జి కొన్న మహిళ పొరపాటున మరిచిపోయిందని గుర్తించారు. అంతలో రాత్రి 10 గంటలకు వడ్డేపల్లి నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ హోటల్లో మా వాళ్ళు మిర్చీలు కొన్నారు. డబ్బులు ఇచ్చేటప్పుడు కమ్మలు పడ్డాయని తెలిపారు. హోటల్ యజమాని కమ్మలు ఇక్కడే ఉన్నాయని పోగొట్టుకున్న మహిళను తీసుకొస్తే నిర్ధారణ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో బాధిత మహిళకు అందజేశారు.
