దొరికిన బంగారం నగలు అప్పగింత

నిజాంసాగర్, బతుకమ్మ : తమ హోటల్లో మరిచిపోయిన బంగారు నగలను బాధితులకు అప్పజెప్పి హోటల్ యజమాని తన మానవత్వాన్ని చాటుకున్నారు.  నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆర్.టి.సి.బస్టాండ్ వెనుకాల ఇమ్రాన్ హోటల్ లో ఆదివారం ఓ మహిళ మిర్చి బజ్జి తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి హోటల్ యజమాని సయ్యద్ మొయిజ్ ఒద్దిన్ పని చేస్తుండగా చెవి కమ్మలను గుర్తించారు. హోటల్ లో పనిచేసే ఆడమనిషికి చూపిస్తే బంగారం కమ్మలని తెలియడంతో తీసుకొని పక్కన పెట్టారు. అంతలో వేరే కస్టమర్లు లేడీస్ వస్తే అడుగుతే...