26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పార్కిన్సన్ వ్యాధిగ్రస్థునికి ఎల్ఓసి అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ

 

మండలంలోని పడగల్ గ్రామానికి చెందిన పార్కిన్ సన్ వ్యాధిగ్రస్థుడు మాడవేడి బాలకుమార్ కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సీ )ని అందజేశారు. భాధితుడు పార్కిన్ సన్ వ్యాధితో భాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతుండగా వైద్యులు చికిత్సకు రూ. 2లక్షల 25 వేలు ఖర్చు అవుతుందని తెలపగా స్థానిక గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. భాధితుని ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే భాధితుని వైద్యానికి అయ్యే ఖర్చు రూ. 2లక్షల 25 వేల ఎల్ ఓ సీ ని భాదిత కుటుంబకులకు అందజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో వెంటనే స్పందించి ఆర్థికంగా చేయూతనిచ్చిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article