27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

చీతా ఫోర్స్ మెరుపు దాడిలో 30 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మండలంలో ని ఆచన్ పల్లి గ్రామంలో చీతా ఫోర్స్ నిర్వహించిన మెరుపు దాడుల్లో రూ.30 లక్షల విలువ ఉన్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. శనివారం సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇన్ చార్జి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించారు.

 

Gutka packets worth Rs 30 lakh seized in Chetah force raid

 

ఈ దాడులలో హెచ్కెజిఎన్ షాప్ డంప్‌తో పాటు హెచ్కెజిఎన్ మటన్ షాప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా సరుకుల అంచనా విలువ సుమారు రూ.30 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుట్కా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలు, రవాణాపై పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న గుట్కా సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించినట్లు తెలిపారు.

 

More articles

Latest article