– యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన భాధిత కుటుంబం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాధంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అక్కడి న్యాయస్థానం ద్వార దక్కిన పరిహరం ను రూ.55 లక్షల చెక్ ను యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధులు అందచేశారు. సోమవారం నిజామాబాద్ కు వచ్చిన యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినేసరి మాట్లాడుతు…గత 15 సంవత్సరాలుగా తమ యాబ్ లీగల్ సర్వీసెస్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జాగీర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజాకు 27 డిసెంబర్ 2022 సంవత్సరంలో షార్జ లో రోడ్ ప్రమాదం జరిగింది. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని అనధికార స్థలంలో రోడ్డు దాటుతుండగా పాకిస్తాన్ చెందిన వాహనదారుడు ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే గద్దల రాజను షార్జా ఆల్ ఖా సినియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు. మరణించిన గద్దల రాజపై అనధికార రహదారి దాటినందుకు అభియోగం మోపడం ద్వారా కేసును అక్కడి కోర్టు కొట్టి వేసింది. ఆ సమయంలోనే గద్దల రాజా అతని బంధువులు ,వారసులు యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినేసరిని కేసును అప్పగించడం జరిగింది. రోడ్డు దాటుతున్న పాదదారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో షార్జా కోర్టు లో తిరిగి కేసు నమోదు చేయడం వల్ల యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు చేసిన కృషి ఫలించింది. షార్జా కోర్టు పాకీస్థాని జాతీయుడు రూ.55 లక్షల పరిహరం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. సగటు భారతీయుడికి సౌదీ, అరబ్, ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వారు యబ్ లీగల్ సర్వీసెస్ కు ఆశ్రయించిన మరో క్షణం నుంచి న్యాయం జరిగే విధంగా ఆయన సూచించారు. ఈరోజు నిజామాబాద్ రావడం మాకు ఎంతో ఆనందంగా కలిగించిందని ఆయన అన్నారు. యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో తో పాటు అరబ్ కంట్రీ సంస్థ సభ్యుడు షేక్ ఆల్ అజీజ్, అబ్దుల్ రావుఫ్. మునీత్ తదితరులు ఉన్నారు.