26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కోర్టులో షూరిటీ సొమ్ము చెల్లించిన జమానతుదారులు

Must read

📰 Generate e-Paper Clip

  • ఒక దొంగకు జమానతుగా ఉన్న ఇద్దరు
  • కోర్టు వాయిదాలకు ముద్దాయి రాక పోవడంతో షూరిటీ సొమ్ము వసూలు చేసిన కోర్టు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జైనులబోద్దీన్ గల్లీ కి చెందిన మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ పలు దొంగతనపు కేసులలో ముద్దాయిగా నేరారోపణలు ఎదుర్కొంటు నిజామాబాద్ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఖుష్భూ ఉపాధ్యాయ్ ఆర్డర్ మేరకు జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా నిజామాబాద్ కేంద్ర కారాగారంలో ఉండేవాడు.అతను న్యాయవాది ద్వారా కోర్టులో బెయిలు దరఖాస్తూ దాఖలు చేయడంతో అతనికి కోర్టు పది వేల రూపాయలకు గాను ఇద్దరు జమానాతు సమర్పించాలని బెయిలు ఉత్తర్వులో పేర్కొన్నది. సదరు ఉత్తరవులననుసరించి బైంసా మండలం లింగా గ్రామానికి చెందిన శిల్కె శంకర్, జక్లి గ్రామ నివాసి వాగ్మారే సోనోభా తమ గ్రామ కార్యదర్శి జారీ చేసిన ఇంటి విలువ సర్టిఫికెట్ లను మహ్మద్ అహ్మద్ హుస్సేన్ కు జమానాతుదార్లుగా ఉంటామని కోర్టులో అతని తరపున న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి కోర్టు పేషికి ముద్దాయిని పంపిస్తామని ప్రమాణ పత్రంతో కూడిన షూరిటీ బాండ్ ను సమర్పించారు. వీరి పిటిషన్ కు ఇంటి వాల్యూవేషన్ సర్టిఫికెట్స్ ను, ఇంటి పన్ను రషీదును, జిరాక్స్ కాపీ ఆధార్ కార్డును జత చేశారు. పిటిషన్ ను పరిశీలించిన కోర్టు వారి జమానాతు ను అంగీకరించి ముద్దాయిని జ్యూడిషియల్ కస్టడీ నుండి విడుదల చేసింది. విడుదల అయినంత అనంతరం అతను కోర్టు వాయిదాలకు రాక పోవడంతో బెయిలుకు వీలులేని అరెస్ట్ వారంట్ జారీ చేసి, షూరిటీ దారులిద్దరికి నోటీసులు ఇచ్చి కోర్టు కు పిలియించింది. కొన్ని నెలల సమయం ఇచ్చిన అనంతరం కూడా ముద్దాయిని వారు హాజరు కు రప్పించక పోవడంతో వారు జమానాతుగా ఉన్నందున నాలుగు కేసులలో ఒక్కొక్క కేసుకు గాను పది వేల చొప్పున మొత్తం నలభై వేలు ఒక్కొక్కరు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నది లేని యెడల నెల రోజుల సాదారణ జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించడంతో ఇద్దరు జమానాతు దారులు చెరి నలభై వేల నగదు కోర్టు లో చెల్లించడంతో వారి జమానాతు ను రద్దు చేస్తు జడ్జి ఖుష్భూ ఉపాధ్యాయ్ ఉత్తర్వులు ఇచ్చారు.

More articles

Latest article