కోర్టులో షూరిటీ సొమ్ము చెల్లించిన జమానతుదారులు
ఒక దొంగకు జమానతుగా ఉన్న ఇద్దరు కోర్టు వాయిదాలకు ముద్దాయి రాక పోవడంతో షూరిటీ సొమ్ము వసూలు చేసిన కోర్టు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జైనులబోద్దీన్ గల్లీ కి చెందిన మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ పలు దొంగతనపు కేసులలో ముద్దాయిగా నేరారోపణలు ఎదుర్కొంటు నిజామాబాద్ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఖుష్భూ ఉపాధ్యాయ్ ఆర్డర్ మేరకు జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా నిజామాబాద్ కేంద్ర కారాగారంలో ఉండేవాడు.అతను న్యాయవాది ద్వారా కోర్టులో బెయిలు...