27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సివిల్ సప్లైహమాలీల హామీలను అమలు చేయాలి 

Must read

📰 Generate e-Paper Clip

గోదాం వద్ద హామాలీల నిరవధిక సమ్మె 

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైహమాలీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలనీ సిపిఎంఎల్ జిల్లా కమిటీ నాయకులు   డిమాండ్ చేశారు. గురువారం భీమ్‌గల్ మండలంలోని బాబానగర్ గోదాం వద్ద రెండో రోజు మోకాలపై నిలబడి సమ్మె చేస్తున్న సివిల్ సప్లై హమాలీలకు మద్దతు తెలిపిన సిపిఎంఎల్ నాయకులు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైకమిషనర్ తో చర్చలు. 4 అక్టోబర్ 2024 జరిగిన చర్చలో భాగంగా క్వింటాలకు రూ.26 రూపాయలు ఉన్నటువంటి హమాలీ రేటు రూ.29 రూపాయలకు పెంచుతూ అంగీకరించి, రెండు జతల బట్టలు, కుట్టు కూలీతో సహా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ప్రతి సంవత్సరం దసరా బోనస్ తో పాటు స్వీటు రేట్లు పెంచుతామని,పెండింగ్లో ఉన్న 10 నెలల కమిషన్ రేట్ ఇస్తామని.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు. ఆరోగ్య హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి.రాష్ట్ర సివిల్ సప్లైకమిషనర్, పౌరసరఫరల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హమాలి సోదరులతో జరిగిన చర్చలు అంగీకరించడం జరిగిందని అన్నారు.ఒప్పంద ప్రకారం జీవో ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సివిల్ సప్లైహమాలీలతో జరిగిన ఒప్పంద ప్రకారం జీవో విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సమ్మె చేస్తున్న హమాలీలు రాజన్న, , పోశెట్టి, శేఖర్, తుక్కారం, అనంత్, ఫయాజ్, రాహుల్, హరీష్, వీరికి మద్దతు తెలిపిన సిపిఎంఎల్  నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article