26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీటీయూ ఆధ్వర్యంలో మహాత్మ గాంధి, శాస్త్రి లకు ఘన నివాళులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్                                                                                                                                                                 

బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ గాంధీ చూపిన బాటలో బిసి లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుకు పోరాటం చేస్తామని, వెంటనే బిసి కుల గణన సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసిటియు జిల్లా ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు కొట్టూరు రమేష్, ఉపాధ్యక్షులు శ్యామ్ ప్రసాద్, బాబు, గౌరవ సలహాదారులు రమణ స్వామి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Great tributes to Mahatma Gandhi and Shastri under the auspices of BCTU

More articles

Latest article