29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్ లకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకుని, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి జీవీఎన్.భరత లక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు హైకోర్టు జడ్జీలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, సీ.పీ, అదనపు కలెక్టర్ తదితరులతో హైకోర్టు న్యాయమూర్తులు అతిథి గృహంలో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు.

 

Grand welcome to High Court judges

More articles

Latest article