27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip


Grand Shivaratri celebrations at Rajarajeswara Temple

నవీపేట్, బతుకమ్మ: అతి పురాతన, మహిమాన్విత స్వయంభూ నాళేశ్వర్ రాజరాజేశ్వర ఆలయంలోమహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మగ్గరి హన్మండ్లు మాట్లాడుతూ.. వీడీసీ ఆధ్వర్యంలో రెండురోజులపాటు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పుప్పాల రమేశ్, మగ్గరి నవీన్,బాగాజీ లక్ష్మణ్, సుంకే రాజేందర్, చిన్నదొడ్డి అఖిలేశ్, ముప్పాటి సాయినాథ్, ఎర్రన్న, మాజీ సర్పంచ్ ద్యాగ సరిన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Grand Shivaratri celebrations at Rajarajeswara Temple

More articles

Latest article