భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలోబుధవారం గంగమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. బోయిగల్లి గంగపుత్ర సంఘ భవనం నుండి భక్తులు బోనాలు, మంగళ హారతులు, వల గొడుగులు, డప్పుల చప్పుడుతో ఊరేగింపు నిర్వహించారు. రాథం చెరువు గంగమ్మ దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ దేవి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన సత్రం నిర్వహించడం జరిగింది . వేద పండితులు రఘు, నాగేంద్రలు శివపార్వతుల కళ్యాణం,యజ్ఞం తో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాల వితరణ, అన్నదానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, భీంగల్ పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
