27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్,  బతుకమ్మ  : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా అన్నారు. సోమవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ ప్రాథమిక వ్యవ్యసాయ సంఘం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తారా భాయి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, రాయకూర్ సొసైటీ చైర్మన్ సంగమేశ్వర్, రుద్రూర్ సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, తోట సంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article