ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నవీపేట్, బతుకమ్మ: మండలంలోని బినోల ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని బినోల, నిజాంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ మగ్గరి హన్మాండ్లు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఏ గ్రేడ్ కు రూ.2320, బి గ్రేడ్ కు రూ.2300 మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు కాంటాను సరి చూసుకోవాలని,...