ఐకేపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్ధాపూర్ గ్రామ సంఘం తరపున ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బక్కుల అనిత చందు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఐకెపి ఏపీఎం బస్వంత్ రావు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించి దిగుబడి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, సీసీ విఠల్, విఓఎ నవనీత,...