24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జీపీ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేసే వహీద్, శ్రీనుకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాయపడిన వహీద్, శ్రీనులను సోమవారం గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు మచ్కూరి అశోక్ తో కలిసి పరామర్శించారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మికు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ.. రుద్రూర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధి దీపాలు పెడుతుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విరిగి వహీద్, శ్రీను మీద పడడంతో వహీద్ కు పక్కటెముకలు, శ్రీనుకు భుజం వద్ద చేయి విరిగి, తీవ్ర గాయాల పాలయ్యారని అన్నారు. గ్రామపంచాయతీ అధికారులు గాయాల పాలైన వహీద్, శీను లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

More articles

Latest article