23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

జీపీ ఎదుట దివ్యాంగుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : దివ్యాంగులకు చేయూత పింఛన్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి  (విహెచ్పిఎస్) జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులు గ్రామపంచాయతీని ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్.. పీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్లు  పెంచని యెడల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 24 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జీపి కార్యదర్శి  ప్రేమదాస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల నాయకులు జల్లా పురం సాయిలు, రాజేందర్, శంకర్, లక్ష్మి గంగామణి, సాయమ్మ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article