27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గోవిందా.. గోవిందా..

Must read

📰 Generate e-Paper Clip

  • కన్నుల పండువగా శ్రీవారి రథోత్సవం
  • గోవింద నామస్మరణతో మార్మోగిన  లింబాద్రి గుట్ట

 

భీమ్ గల్, బతుకమ్మ : గోవిందా హరి గోవిందా శ్రీలక్ష్మి నర్సింహా గోవిందా.. అనే హరినామా సంకీర్తన మధ్య మండలంలోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో  భాగంగా  కార్తీక  పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో శ్రీ నింబాచల క్షేత్రం పులకించిపోయింది . క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసు దేవాచార్యులు ఇతర అర్చకులు వేద  మంత్రోచ్చారణల మధ్య లక్ష్మిదేవి కొలువై ఉండే స్వామివారి రథాని ప్రాణ ప్రతిష్ట గావించారు.శ్రీమన్నారాయణుడిని ఆహ్వానించి షోడశోపచార పూజలు నిర్వహించారు. రథం ప్రథమ స్థలమందు గరుత్మంతునికి ప్రాణప్రతిష్ఠ గావించారు. రథానికి జీవకళ చేకూర్చేందుకు తత్వన్యాస  మొనరించారు. రథచక్రాలలోలోకి ప్రతాప వంతుడైన వాయు పుత్రుని ఆహ్వానించారు.

Govinda.. Govinda..

స్తంభాది  మొదలగు అభిమాన దేవతలకు రథ శక్తి హోమం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు తక్షకుడిని, కర్కోటకుడిని ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ట చేశారు.  రథ ప్రతిష్ట సంపూర్ణ ఫలం కోసం హోమం,పూర్ణాహుతి నిర్వహించి అగ్నిహోత్రానికి ప్రత్యేక పూజలు చేశారు.శాస్త్రప్రోక్తమైన రథ ప్రతిష్టా హోమముచే జీవకళలు ఉట్టి పడునట్టు రథము స్వర్ణాలంకార శోభతమై, నాలుగు దిక్కులకు నాలుగు దిక్కులకు భగవంతుని పఠములను అలంకరించారు. రథము యొక్క మూడవ తలములో గల భగవంతుని సింహాసన స్థలం లో శ్రీ లక్మీ నృసింహుని మోయుటకు సిద్ధముగా ఉన్న గరుత్మంతునితో అలారారే మహారథమునకు పూర్వ ప్రతిష్టా కుంభముచే ప్రోక్షణ నొనరించి అష్ట దిక్కులకు బలి ప్రధానమోనరించారు.

శ్రీ లక్మీ నృసింహుడు మూడవ తలమున ఆశీనులను జేసీ మంగళ హారతి నొసంగిన తరవాత భక్త జనులందరు  జయ గోవింద అను శబ్దములు, డప్పుల చప్పుల్లు, మంగళ వాయిద్యాలు మొగుతుండగా ఉప్పొంగిన భక్తితో రథ భ్రమణము గావించారు. రథముపై ఆశీనులైన శ్రీ కేశవుని ( శ్రీ లక్మీ నృసింహుని ) చూసిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

Govinda.. Govinda..

  • పోటెత్తిన భక్తజనం..

రథోత్సవాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండే బారులు తీరారు .వివిధ దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు హాజరయ్యారు. వేకువ జాము నుండి పుష్కరిణి  వీధుల నుండి మెట్ల మార్గం గుండా గర్భాలయం లో స్వామి వారి వరకు  రద్దీ కనిపించింది. జాతరను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వర్ణాలంకరణ చేశారు. దేదీప్యామానమైన స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయత్నం చెందారు.

  • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..

రథోత్సం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్సై సందీప్ అద్వర్యంలో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. గర్భాలయంలోని మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెల్లే భక్తుల క్రమబద్దీకరణ నుండి రథోత్సవం ముగిసే వరకు బందో బస్తు చర్యలను పకడ్భందిగా నిర్వహించారు. ఈ రథోత్సవం కార్యక్రమం లో  కేంద్ర పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బాల్కొండ కానిస్టెన్సీ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్.రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బాల్కొండ కానిస్టెన్సీ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి,డాక్టర్. మధు శేఖర్,మాజీ జడ్పిటిసీ చౌట్ పల్లి రవి, మాజీ ఎంపిపి కన్నె సురేందర్, కె.ఎస్ రవీందర్, మూడేడ్ల జితేందర్, విడీసీ ప్రెసిడెంట్ నీలం రవి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బోదిరే స్వామి, కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాయక్, జె జె నర్సయ్య, పర్స అనంతరావు, బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ యోగేశ్వర నర్సయ్య, బీజేపీ పట్టణ ప్రెసిడెంట్ కనికరం మధు, సంఘం అనిల్, మల్కాన్నగారి మోహన్ తదితర  ప్రముఖులు పాల్గొన్నారు.

Govinda.. Govinda..

More articles

Latest article