27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్:

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ తో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం ప్రమాణం చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనవరిలో గవర్నర్ కోటాలో ఆచార్య కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ను ఎమ్మెల్సీలుగా నామినేట్ విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 2023లో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా, నాటి గవర్నర్ తమిళసై ఆమోదం తెలుపకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కొత్త ప్రభుత్వం చేసిన సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో శ్రవణ్, సత్యనారాయణ హై కోర్టును ఆశ్రయించగా, గవర్నర్ చేసిన నియామకాలను కొట్టివేసి స్టేవిధించింది. హై కోర్టు స్టేపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోదండరాం, అలీఖాన్ లకు బుధవారం సుప్రీం కోర్టులో లైన్ క్లియర్ కావడంతో వారు ప్రమాణం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

 

More articles

Latest article