నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో మా పల్లె సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన కళాకారులను బుధవారం త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఘనంగా సత్కరించారు. అదే విధంగా ఇందూరు అన్నమయ్య నర్సింహారెడ్డి రచించిన పాటల సీడీ “శ్రీనివాసం” ను ఆవిష్కరించారు. కవి, వ్యాఖ్యాత ఘనపురం దేవేందర్, ప్రసిద్ధ కూచిపూడి, ఆంధ్ర నాట్యం

ఆచార్యులు జయలక్ష్మి, ప్రసిద్ధ గాయనీమని సంగీత గురువు స్వప్న, ప్రముఖ రంగస్థలం సినీ నటుడు రవి, ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు విజయ్ లను గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా సంస్కృతి పరంగా భారతదేశం అత్యంత ధనవంతమైన దేశమని అన్నారు. అందుకు కవుల కళాకారుల పాత్ర అద్వితీయమని అభినందించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యక్రమాలలో కళాకారుల

సహకారం అభినందనీయమని మా పల్లె ట్రస్ట్ దేవస్థానం ఆలయ ధర్మకర్త వి.నరసింహారెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

