కళాకారులను సత్కరించిన త్రిపుర గవర్నర్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో మా పల్లె సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన కళాకారులను బుధవారం త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఘనంగా సత్కరించారు. అదే విధంగా ఇందూరు అన్నమయ్య నర్సింహారెడ్డి రచించిన పాటల సీడీ “శ్రీనివాసం” ను ఆవిష్కరించారు. కవి, వ్యాఖ్యాత ఘనపురం దేవేందర్, ప్రసిద్ధ కూచిపూడి, ఆంధ్ర నాట్యం ఆచార్యులు జయలక్ష్మి, ప్రసిద్ధ గాయనీమని సంగీత గురువు స్వప్న, ప్రముఖ రంగస్థలం సినీ నటుడు రవి, ప్రముఖ గాయకుడు...