27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రభుత్వ పనులను పూర్తి చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు

 

 భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో నడుస్తున్న ప్రభుత్వ పనులను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు వెంటది వెంట పూర్తి చెయ్యాలని డీ పీ ఓ, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు సూచించారు.  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,  వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ పనులు, సీజనల్ వ్యాధులు వనమహోత్సవము తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు పనులు పూర్తిచేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్,  ఎం పి ఓ జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, పంచాయతీ రాజ్ ఏ ఈ విక్రమ్, ఏ. ఈ ఆర్ డబ్ల్యూస్ అమూల్య, ఏపీ ఓ నరసయ్య,ఆర్టికల్చర్ అధికారి,ఏ ఈ ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article