ధర్నాలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్రంలో ‘సై’ అంటు.. ఢిల్లీలో 'నై' అంటున్న బిజెపి నేతల తీరును ఖండించిన ఆది బిజెపికి వ్యతిరేకంగా ధైర్యం చేయలేకపోతున్న బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ పై మా పోరాటం ఇప్పటితో ఆగదు..! సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టారు. తెల్లవారుజామున నుంచే బస్సులు బయటకు వెళ్లకుండా...