ఫీజు రీయంబర్స్మెంట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం

ప్రమాదంలో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్ స్పందించని సర్కారుపై కంచర్ల రవిగౌడ్ ఆగ్రహం   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్‌పై చూపుతున్న నిర్లక్ష్యంపై బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవిగౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం  సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో ఉందని,కాలేజీలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “పది వేల కోట్ల రూపాయలు బకాయిలుగా...