25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రిటైర్మెంట్ కు బంగారం కానుకగా ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నందిపేట వైద్య ఉద్యోగి హుకుం
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు

నిజామాబాద్, బతుకమ్మ :
ఆయనో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి. వచ్చే నెలలో పదవి విరమణ ఉంది. దీనికిగాను తన సొంత ఉద్యోగుల వద్ద నుండి బంగారం కావాలంటూ గత పది రోజులుగా ఉద్యోగులను వేదింపులకు గురి చేస్తున్నారు. వచ్చే నెలలో తన పదవీ విరమణ ఉందని నందిపేట ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్ల ఉద్యోగులందరూ కలిసి తులం బంగారం కానుకగా పెట్టాలంటూ హుకుం జారి చేస్తున్నారు. గత 15 రోజులుగా ప్రతి సబ్ సెంటర్లు తిరుగుతూ, ఆరోగ్య కేంద్రానికి వెళ్తూ ఉద్యోగులకు తానే స్వయంగా ఫోన్లు చేస్తూ హుకుం చేస్తున్నాడు. ఇటీవల బంగారం ధర విపరీతంగా పెరిగడంతో సదరు అధికారి పదవి విరమణ చేస్తున్నా నాకు గుర్తుండిపోయేలా తులం బంగారం కానుకగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇటీవల జరిగిన ఆరోగ్య కేంద్రంలోని సమావేశంలోనూ నేరుగా బంగారమే ఇవ్వాలంటూ పేర్కొన్నారు. వచ్చే నెలలో పదవి విరమణ కార్యక్రమానికి ప్రస్తుతం నందిపేట ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్లు రోజువారిగా తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఆశా కార్యకర్తలను సైతం ప్రతి ఒక్కరు 5 వేలరూపాయలు ఇయ్యాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాంట్రాక్టు రెగ్యులర్, ఏఎన్ఎం నుండి భారీగా వసూలు చేస్తున్నాడు. ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు తో పాటు నాలుగో తరగతి ఉద్యోగులను సైతం డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు సైతం కొత్త వస్త్రాలు కొనివ్వాలి ఘనంగా సన్మానం చేయాలని పట్టుబడుతున్నాడు. బంగారంతో పాటు సన్మానం తనకు ముఖ్యమని ఆదేశాలు జారీ చేస్తున్నాడు. సదరు ఉద్యోగి వేధింపులకు అక్కడే వైద్య సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. తన పదవి విరమణ కార్యక్రమానికి బలవంతంగా డబ్బులు వసూలు చేయడమేంటి అని వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఆకస్మిక తనిఖీలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆశ వర్కర్లపై ఇటీవల సమావేశంలో ఆవేశానికి గురై ఇష్టానుసారంగా మాట్లాడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సదరు ఉన్నతాధికారులకు దృష్టిని తీసుకువెళ్లేందుకు నందిపేట ఆరోగ్య కేంద్రం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఉన్న అధికారులకు తెలియజేసేందుకు రాగా అక్కడ జిల్లా అధికారి అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగిపోయినట్లు సమాచారం. పదవి విరమణ పేరిట ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం డబ్బులు వసూలు చేయడం ఏమిటని వారు వాపోతున్నారు.

More articles

Latest article