రేపు గో రక్ష మహాపాదయాత్ర

నిజామాబాద్, బతుకమ్మ: గోరక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ కోసం అఖిల భారత గో సేవ ఫౌండేషన్ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ  గురుస్వామి తన బృందంతో కాశీ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర 12వ తేదీన నిజామాబాద్ నగరానికి చేరుకుంటుందని కార్యక్రమ సమన్వయ కార్యకర్త మరాఠా సంతోష్ కుమార్ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  గురువారం ఉదయం 9గంటల నుంచి నీలకంఠేశ్వరాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని, రైల్వే స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు శోభాయాత్ర...